Shraddha Kapoor: "నేను క్షేమంగానే ఉన్నా": గాయంపై స్పందించిన శ్రద్ధా కపూర్
Shraddha Kapoor: ప్రస్తుతం శ్రద్ధా కపూర్ నటిస్తున్న చిత్రం 'ఈఠా'. ఇటీవల నాసిక్‌లో వేసిన భారీ సెట్‌లో, భారీ కాస్ట్యూమ్స్ ధరించి డ్యాన్స్ చేస్తుండగా ఆమె కాలుకు గాయమైన విషయం తెలిసిందే.
Shraddha Kapoor: "నేను క్షేమంగానే ఉన్నా": గాయంపై స్పందించిన శ్రద్ధా కపూర్
Shraddha Kapoor: ప్రస్తుతం శ్రద్ధా కపూర్ నటిస్తున్న చిత్రం 'ఈఠా'. ఇటీవల నాసిక్‌లో వేసిన భారీ సెట్‌లో, భారీ కాస్ట్యూమ్స్ ధరించి డ్యాన్స్ చేస్తుండగా ఆమె కాలుకు గాయమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా, శ్రద్ధా కపూర్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఒక అభిమాని పోస్ట్ చేసిన ప్రశ్నకు ఆమె రిప్లై ఇస్తూ, తన హెల్త్ అప్‌డేట్ అందించారు.
"పెద్ద దెబ్బ ఏమీ కాదు. కాలి కండరానికి దెబ్బ తగిలి కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నేను క్షేమంగానే ఉన్నా. త్వరలోనే మీ ముందుకు వస్తాను." ఎడమ కాలుకు గాయం కావడంతో 'ఈఠా' షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ దాదాపు 15 కిలోల బరువు పెరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.