అందుకే ఇళయరాజాతో పనిచేయలేదు అంటున్న శంకర్

Update: 2019-02-09 07:37 GMT

టాలీవుడ్ లోనే లెజెండరీ సంగీత దర్శకులలో ఇళయరాజా ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడి కల. అలాంటిది దర్శకుడు శంకర్ ఆయనతో సినిమా చేయాలనుకుని కూడా చేయలేక పోయాడు. ఈ మధ్యనే తానిప్పటి వరకు ఇళయరాజాతో ఎందుకు పనిచేయలేదు అనే విషయం పై క్లారిటీ ఇస్తూ నిజానికి తన కెరీర్ మొదట్లోనే 'జెంటిల్మెన్' సినిమా లో ఇళయరాజా తో పని చేయాలని అనుకున్నాడట. ఆయన దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారట.

మరి ఎందుకు చేయలేదు అంటే ఆయన పట్ల తనకున్న గౌరవం వల్ల ఒక్క మాట కూడా బయటకు వచ్చేది కాదని, ఇళయరాజా మ్యూజిక్ డిక్షనరీ అని ఆయనతో పని చేయాలనుకుంటే పని చేయాలంటే తనకున్న నాలెడ్జ్ సరిపోదు అనిపించిందని అని చెప్పుకొచ్చాడు శంకర్. "ఆయన పట్ల నాకున్న గౌరవం వల్ల ఆయనను అది కావాలి ఇది కావాలని నేను అడగలేను. అందుకే ఆయనతో పని చేయలేదు" అని అన్నాడు శంకర్. ఇళయరాజా తో పని చేయ లేకపోయినప్పటికీ ఆయనతో కలిసి తాను ఒక కమర్షియల్ లో నటించానని గర్వంగా చెప్పాడు. 

Similar News