Sarkari vari paata heroine: మహేష్ తో ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్!

sarkari vari paata heroine:ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు.

Update: 2020-06-27 08:46 GMT

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టలెక్కనుంది.. ప్రస్తుతం చిత్ర యూనిట్ నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది..

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందట.. అయితే ఆ పాత్ర కోసం తమిళ నటి నివేతా థామస్ ని ఎంపిక చేశారని తెలుస్తుంది.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమెతో చర్చలు జరిపారని తెలుస్తోంది.. అన్నీ కుదిరితే నివేద థామస్ ఈ సినిమాలో మెరవడం ఖాయమే..

ఇక ప్రస్తుతం నివేద థామస్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన v అనే సినిమాలో ఆమె నటించింది. సినిమా విడుదలకి సిద్దంగా ఉంది..

ఇక మహేష్ బాబుకి 27వ చిత్రంగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట అనే సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. 


Tags:    

Similar News