Fathers Day 2020: మీరు చూపించిన మార్గమే అనుసరిస్తున్నా నాన్నా..మహేష్ ట్వీట్

Fathers Day 2020: మీరు చూపించిన మార్గమే అనుసరిస్తున్నా నాన్నా..మహేష్ ట్వీట్
x
Highlights

ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది. ఊపిరి తీసుకున్న క్షణం నుంచి.. జీవితపు చివరి అంచుల వరకూ అన్నిదశాల్లోనూ...

ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది. ఊపిరి తీసుకున్న క్షణం నుంచి.. జీవితపు చివరి అంచుల వరకూ అన్నిదశాల్లోనూ ప్రభావితం చేసే శక్తి అది. నాన్న.. రెండక్షరాలు.. కానీ ఆ శబ్దం ఇచ్చే అనుభూతి ప్రతి తండ్రికి ఓ మధురస్మృతి. ప్రతి తయునికి జీవిత కాలపు పెన్నిధి. తన జీవితాన్ని త్యాగం చేసే ప్రతి కొడుకు, కూతురు జీవితంలో నాన్న పాత్ర మరువలేనిది. మహనీయమైనది నాన్న ఎప్పుడూ పిల్లల గుండెల్లో ఉంటాడు. అదే మనం నాన్నకు ఇచ్చే గౌరవం. పిల్లలను ఎవరినైనా మీ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే చాలా మంది పిల్లల నుంచి వచ్చే సమాధానం ఎంటో తెలుసా? నాకు మానాన్న అంటే చాలా ఇష్టం అని చెపుతారు. మరికొంత మంది నాకు మా అమ్మ అంటే ఇష్టం అని చెపుతుంటారు.

ఫాదర్స్ డే సందర్బంగా తండ్రితో తన బంధాన్ని తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు మహేష్ బాబు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని.. పిల్లలతో తనకు ఉన్న ప్రేమను వ్యక్తం తెలియపరుస్తూ.. "ప్హ్యారేమతో కూడిన ద్పీరుఢమైన బంధాన్ని మీరు నాకిచ్చారు నాన్నా. మీరు చూపించిన మార్గంలోనే నేనూ నా పిల్లల విషయంలో అసుస్సరిస్తున్నాను.హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా మీరు ఎల్లప్పుడూ నా మార్గం" అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

మరో వైపు మాస్ మహారాజ రవితేజ కుడా తన తండ్రితో, పిల్లలతో ఉన్న బంధాన్ని తెలుపుతూ ట్వీట్ చేసారు. రవితేజ లాంటి స్టార్లు రేర్ గా మాత్రమే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తుంటారు. "తండ్రి వారి పిల్లలకు విజయానికి వారధి'' అని ట్వీట్ చేసారు.

ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. చాల వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories