Sandalwood Drug Case : రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ భారీ ఆస్తులు!
Sandalwood Drug Case : కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ అంశం కాకారేపుతుంది. ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను
ragini dwivedi, Sanjana Galrani
Sandalwood Drug Case : కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ అంశం కాకారేపుతుంది. ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. విచారణలో భాగంగా వారి వారి ఆస్తుల మీదా అరా తీశారు అధికారులు . అయితే సంజన తనకి బెంగుళూరు నగరంలో పది ప్లాట్స్ ఉన్నట్టుగా చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారట.. చిన్న చిన్న సినిమాలు చేసిన సంజనా గల్రానీ ఇన్ని ఆస్తులను ఎలా సంపాదించారు అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇక వీరిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రత్యేక న్యాయస్థానం ముందు పోలీసులు హాజరు పరిచారు. ఇందులో వీరికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టుగా ఆధారాలు సేకరించామని, కానీ వాటి గురించి అడిగిన ప్రశ్రలకూ వారు బదులివ్వడం లేదని పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. మరో వారం రోజుల పాటు వీరిని తమ కస్టడీకి అప్పగించాలని వారు న్యాయ స్థానాన్ని కోరారు.. అయితే వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి సోమవారం వరకు వారిద్దరినీ సీసీబీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు
ఇందులో రాగిణి కస్టడీ శుక్రవారం సాయంత్రానికి ముగియగా, సంజన కస్టడీ శనివారం సాయంత్రానికి ముగియనుంది. ఇక ఈ కేసులో రాగిణి ద్వివేది జామీను కోసం దాఖలు చేసిన విచారణను ఏసీఎంఎం న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.