Sanjana Galrani : డ్రగ్స్ కేసులో కొత్త విషయం!

Sanjana Galrani: కన్నడ సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే నటి రాగిణి ద్వివేది, సంజనా గల్రాని లను సీసీబీ

Krishna
Updated on: 12 Sept 2020 12:33 PM IST
Sanjana Galrani  :  డ్రగ్స్ కేసులో  కొత్త విషయం!
X

Sanjana Galrani

Sanjana Galrani: కన్నడ సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే నటి రాగిణి ద్వివేది, సంజనా గల్రాని లను సీసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిని వేరువేరుగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణలో కొత్త విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు సంజన తనకి పెళ్లి కాలేదని చెప్పగా విచారణలో పోలీసులు ఆమెకి పెళ్లి అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు.

దీనితో ఆమె పెళ్లి ఆయునట్టుగా ఆమె ఒప్పుకోక తప్పలేదని తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ అజీజ్ పాషాతో పెళ్లి జరిగినట్టు ధృవీకరిస్తున్న ఓ ఫోటో మీడియాలో వెలుగు చూసింది. దీనిపైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని నెలల క్రితం తెలుగు ఛానెల్‌లో జరిగిన టాక్ షోలో సంజన మాట్లాడుతూ, తాను ఓ డాక్టర్‌తో ప్రేమలో ఉన్నానని పేర్కొంది. ఇప్పుడు వారి పెళ్లి అని చెప్పబడిన ఫోటో వైరల్ అవుతోంది.

ఇక డ్రగ్స్ విషయంలో రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలను లను లోతుగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. డ్రగ్స్‌ను డెబిట్, క్రెడిట్, బిట్‌ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డ్రగ్స్‌ కేసులో మహిళా సాంత్వన కేంద్రంలో ఉంటున్న రాగిణి, సంజనా గల్రానీలకు ప్రత్యేక గదులను కేటాయించారు. ఇద్దరి మధ్య విభేదాలున్నందున వారికి ప్రత్యేకమైన గదులను కేటాయించారు.. ఇద్దరికి భద్రతను కూడా పెంచారు..

Krishna

Krishna

Next Story