డ్రగ్స్‌ కేసులో నటి సంజన అరెస్టు

డ్రగ్స్‌ కేసులో నటి సంజన అరెస్టు
x
Highlights

Sandalwood drugs case: తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది. డ్రగ్స్‌ మాఫియాతో శాండ‌ల్‌వుడ్ లో పలువురు...

Sandalwood drugs case: తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది. డ్రగ్స్‌ మాఫియాతో శాండ‌ల్‌వుడ్ లో పలువురు నటీనటులకు సంబంధాలున్నాయని బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌(సీసీబీ) పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రశ్నించడం కోసం బెంగళూరు పోలీసులు మంగళవారం నటి సంజనా గల్రానిని అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం ఇందిరా నగర్‌లోని నటి ఇంట్లో సీసీబీకి చెందిన అధికారులు సోదాలు జరిపి, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. 'సర్దార్ గబ్బర్ సింగ్', 'యమహో యమ', 'బుజ్జిగాడు' తదితర చిత్రాల్లో సంజన నటించింది. కన్నడ చిత్రం 'దండుపాళ్యం'లో ఆమె నటకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు ఆమె అరెస్ట్ కావడం కన్నడ పరిశ్రమతో పాటు టాలీవుడ్ లో సైతం ప్రకంపనలు రేపుతోంది.Show Full Article
Print Article
Next Story
More Stories