Samantha: ఇలా త‌యార‌య్యారేంట్రా బాబు.. మొన్న నిధి.. నిన్న సమంత..

Samantha: ప్రజా కార్యక్రమాల్లో సెలబ్రిటీలకు రక్షణ కల్పించడంలో నిర్వాహకుల వైఫల్యం మరోసారి చర్చనీయాంశమైంది.

Update: 2025-12-22 05:54 GMT

Samantha: ఇలా త‌యార‌య్యారేంట్రా బాబు.. మొన్న నిధి.. నిన్న సమంత..

Samantha: ప్రజా కార్యక్రమాల్లో సెలబ్రిటీలకు రక్షణ కల్పించడంలో నిర్వాహకుల వైఫల్యం మరోసారి చర్చనీయాంశమైంది. అభిమానుల అత్యుత్సాహం హద్దులు దాటుతుండటం, వెకిలి చేష్టలతో నటీమణులను ఇబ్బంది పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా టాలీవుడ్ స్టార్ నటి సమంతకు హైదరాబాద్‌లో ఊహించని పరిణామం ఎదురైంది. నగరంలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన ఆమె, కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకొచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడుతూ, ఆమె కారు వైపు వెళ్లకుండా అడ్డుకోవడంతో సమంత తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. చివరకు బాడీగార్డ్‌లు చాలా కష్టపడి ఆమెను రక్షణగా కారు వరకు తీసుకెళ్లడంతో గండం గడిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొద్దిరోజుల క్రితమే ‘ది రాజాసాబ్’ ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్ కూడా ఇలాగే అభిమానుల రద్దీలో చిక్కుకుని అసౌకర్యానికి గురయ్యారు. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తుంటే, లోపం ఎక్కడుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిర్వహణా లోపమా? భారీ ఎత్తున జనం వస్తారని తెలిసినప్పుడు సరైన బారికేడ్లు, సెక్యూరిటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? అభిమానుల అతిశయమా? తమ అభిమాన నటిని చూడాలనే ఆత్రుతలో ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను (Personal Space) గౌరవించకపోవడం ఎంతవరకు సమంజసం?

సమంతకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు అభిమానుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. "అభిమానం అంటే గౌరవించడం, అంతేగాని ఇలా అసభ్యంగా ప్రవర్తించడం కాదు" అని కొందరు కామెంట్ చేస్తుంటే, "ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠినమైన నిబంధనలు ఉండాలి" అని మరికొందరు కోరుతున్నారు.


Tags:    

Similar News