Samantha: అందుకే సినిమాలు తగ్గించాను

Samantha: దక్షిణ భారత స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ విషయంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-08-21 05:01 GMT

Samantha: అందుకే సినిమాలు తగ్గించాను

Samantha: దక్షిణ భారత స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ విషయంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయకుండా, తన ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తాజాగా ‘గ్రాజియా ఇండియా’ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ మేగజీన్ తాజా ఎడిషన్ కవర్‌పేజీపై కూడా సమంత మెరిసింది.

"ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయను. నా శరీరం చెప్పే మాట వినాలని గ్రహించాను. అందుకే పనిభారం తగ్గించుకుంటున్నాను. నా శారీరక, మానసిక ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తాను" అని సమంత తెలిపారు.

ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత మాత్రం పెరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. "తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల మనసుకు నచ్చే మంచి కథలతోనే ముందుకు వస్తాను" అని చెప్పారు.

ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందని సమంత పేర్కొన్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ,

"అక్కడ మనకు వచ్చే ప్రశంసలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో... ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను కూడా అంతే హుందాగా తీసుకోవాలి. అవి మన జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్లకూడదు" అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సమంత రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా *‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’*లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News