మాట నిలబెట్టుకున్న మెగా హీరో!

Sai Dharam Tej Helps : టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. విజయవాడలోని 'అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్

Update: 2020-09-19 06:26 GMT

Sai Dharam Tej Helps : టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. విజయవాడలోని 'అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్' సదుపాయాలు లేక ఆదరణ కోసం ఎదురు చూస్తుండగా.. తాను ఆదుకుంటానని మెగా హీరో గతంలో ముందుకు వచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో రెండు అంతస్థుల బిల్డింగ్‌ను నిర్మించాడు. సాయి ధరమ్ తేజ్ చేసిన మంచి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు సూపర్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అటు సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వచ్చేసరికి గత ఏడాది చిత్రలహరి, ప్రతి రోజూ పండగే చిత్రాలతో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇది సాయి ధరమ్ తేజ్ కు 13 వ సినిమా కావడం విశేషం

ఇక ఈ సినిమా తర్వాత 14 వ సినిమాని దేవాకట్టా దర్శకత్వంలో చేస్తున్నారు. ఇక కార్తీక్ దండు ద‌ర్శక‌త్వంలో సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా చేస్తున్నాడు. సుకుమార్ ఈ సినిమాకి కథను అందిస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.




 


Tags:    

Similar News