Oscars: 'ఆస్కార్‌' వేదికపై 'నాటు నాటు'.. లైవ్ లో పాడనున్న రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ..

RRR Moive: అంతర్జాతీయ వేదికలపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' సత్తా చాటుతుంది.

Update: 2023-03-01 05:47 GMT

Oscars: ‘ఆస్కార్‌’ వేదికపై ‘నాటు నాటు’.. లైవ్ లో పాడనున్న రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ..

RRR Moive: అంతర్జాతీయ వేదికలపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషన్‌ అవార్డులను గెలుచుకున్న ట్రిపుల్‌ఆర్‌ ఇప్పుడు ఆస్కార్‌పై కన్నేసింది. ఓరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి 'నాటు నాటు' పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఈ తరుణంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ టీంకి మరో అరుదైన ఘనత దక్కింది. ఎం.ఎం. కీరవాణీ సంగీత దర్శకత్వం అందించిన 'నాటు నాటు' సాంగ్‌ని సినిమాలో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన విషయం తెలిసిందే. మార్చి 12న జరగనున్న ఆస్కార్స్ 2023 స్టేజ్‌పై ఈ సింగర్స్ ఇద్దరూ ఈ పాటని పాడే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆస్కార్ యాజమాన్యం ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. అందులో.. ''95వ ఆస్కార్స్ స్టేజ్‌పై రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ్ 'నాటు నాటు' పాటని పాడనున్నారు' అని రాసుకొచ్చింది.


Tags:    

Similar News