Powerstar vs RGV: ఏమిటీ పిచ్చి పిచ్చిగా ఉందా..మా హీరో మీద సినిమా తీస్తావా? అర్జీవీ మీద షకలక శంకర్ ఫైర్!

Powerstar vs RGV: రాంగోపాల్ వర్మ పవన్ ఫ్యాన్ అయితే పవర్ స్టార్ మూవీ పై ఏమంటారు?

Update: 2020-07-24 12:00 GMT
Ramgopal varma and shakalaka shankar

Powerstar vs RGV: ఆయనకి తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది.. ఈయనకూ తిక్కుంది కానీ, దాని లెక్క మాత్రం ఎవరికీ తెలీటం లేదు. ఆ ఇద్దరూ ఎవరో తెలిసిందా. అవును..మీరు అనుకుంటున్న వారే. మొదటి ఆయన పవన్ కళ్యాణ్.. రెండో అయన ఆర్జీవీ అని అందరూ పిలుచుకునే రాంగోపాల్ వర్మ! ఇప్పుడు వీరిద్దరి తిక్కల లెక్క సోషల్ మీడియా తెలుస్తోంది. ఎందుకంటారా? ఆర్జీవీ పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తున్నారు. పవర్ స్టార్ పేరుతో తీస్తున్న సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటె ఈ పవర్ స్టార్ కు పోటీగా ఆర్జీవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ సినిమా మొదలు పెట్టారు. పరాన్నజీవి పేరుతో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఆర్జీవీగా ప్రముఖ కామెడీ నటుడు షకలక శంకర్ నటిస్తున్నారు.

వీరిద్దరినీ HMTV ఒకే వేదిక మీదకు తీసుకువచ్చింది. ఇద్దరితోనూ సినిమాలకు సంబంధించి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆర్జీవీ ఒక ప్రతిపాదన చేశారు. తాను పవర్ స్టార్ ఫ్యాన్ గానూ.. షకలక శంకర్ అర్జీవీగాను కొద్దిసేపు నటిద్దామని చెప్పారు. దానికి మొదట కొద్దిగా మొహమాట పడిన శంకర్ తరువాత ఒకే అన్నారు. దీంతో ఆర్జీవీ ''ఆర్జీవీ నీకు పనీ పాట లేదా.. మా పవర్ స్టార్ మీద ఎందుకు పడ్డావురా నువ్వు..'' అంటూ పవన్ అభిమానిలా ప్రశ్నించారు. '' పిచ్చి పిచ్చిగా అంటే.. సినిమా యే కదా తీసింది. అంటే నేను తీసింది సినిమానే కదా..'' అంటూ ఆర్జీవీ స్టైల్ లో సమాధానం ఇచ్చారు శంకర్. అంతేకాకుండా అదేటండీ బాబు అలా అనేశారు.. పిచ్చి పిచ్చిగా అంటూ వర్మను అడిగారు. దానికి అర్జీవీ.. అదే ప్రశ్న నన్ను అడగండి అని ఆ ప్రశ్నను శంకర్ తో అడిగించుకుని.. ''ఔను..ఉంది అయితే ఏంటి?'' అంటూ జవాబిచ్చారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో షకలక శంకర్ ఆర్జీవీ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంటూ చెప్పారు. నవ్వుల పూవులు పూయిస్తూనే..అర్జీవీ తాను ఈ సినిమా ఎందుకు తీశాను అనేది చెప్పుకొచ్చారు. HMTV ఇంటర్వ్యూ లో మీరూ చూసేయండి!

Full View

 


Tags:    

Similar News