Idiot-2: మహాధన్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ
Idiot-2: మహాధన్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ
Idiot-2: మహాధన్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ
Ravi Teja: టాలీవుడ్ లో నేపొటిజంకి కదవలేదు. సీనియర్ హీరోల నుంచి సీనియర్ టెక్నీషియన్ల వరకు చాలామంది వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు గానో లేక మ్యూజిక్ డైరెక్టర్లు గానో లేదా ఏదో ఒక విధంగా పరిచయం అవుతూనే ఉన్నారు. ఇక కేవలం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు ఉండగా నందమూరి కుటుంబం నుంచి ముగ్గురు లైన్ లో ఉన్నారు. దగ్గుబాటి కుటుంబం నుంచి ఇద్దరు హీరోలు ఉండగా అక్కినేని కుటుంబం నుంచి ఐదుగురు ఉన్నారు.
తాజాగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ తనయుడు మహాధన్ త్వరలోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడట. 20 ఏళ్ల క్రితం 2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన "ఇడియట్" సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా "ఇడియట్ 2" తో మహాధన్ ను హీరోగా మార్చాలని రవితేజ అనుకుంటున్నారని పుకార్లు వినిపించాయి.
అయితే తాజాగా "వాల్తేరు వీరయ్య" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రవితేజను ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అని అడగగా రవితేజ షాకింగ్ సమాధానం ఇచ్చారు. అసలు అలాంటిదేమీ లేదు ఇది వినడానికి చాలా కొత్తగా ఉంది అని రవితేజ తోసిపుచ్చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మహాధన్ ఇంకా చాలా చిన్నవాడని అన్నారు. ఇక మహాధన్ ఇప్పటికే "రాజా ది గ్రేట్" సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.