Ramya Krishna: ఆ 7 ఏళ్లు నా సినిమాలన్నీ ఫ్లాపే.. పాత రోజులను పంచుకున్న సీనియర్ హీరోయిన్

Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ తన కెరీర్‌ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు.

Update: 2025-10-27 10:57 GMT

Ramya Krishna: ఆ 7 ఏళ్లు నా సినిమాలన్నీ ఫ్లాపే.. పాత రోజులను పంచుకున్న సీనియర్ హీరోయిన్

Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ తన కెరీర్‌ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఐరన్‌లెగ్‌ అని పిలిచేవారని చెప్పారు. వరుస ఫ్లాపుల తర్వాత విశ్వనాథ్‌ సినిమా మలుపు తిప్పింది. ఆ తర్వాత కెరీర్‌ స్పీడ్‌ పుంజుకుంది.

స్టార్ హీరోలతో నటించి మెప్పించిన సీనియర్ హీరోయిన్‌ రమ్యకృష్ణ తన కెరీర్‌ ఆరంభ దశను గుర్తుచేసుకున్నారు. జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్‌ షోలో ఆమె అతిథిగా పాల్గొన్నారు. ‘నా కెరీర్‌ ప్రారంభంలో అందరూ నన్ను ఐరన్‌లెగ్‌ అని పిలిచేవారు. తెలుగులో నా తొలి చిత్రం భలే మిత్రులు. అందులో సెకండ్‌ హీరోయిన్‌గా నటించాను. వరుసగా 7 సంవత్సరాలు నా సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి’ అని ఆమె వెల్లడించారు.

ఇంకా రమ్యకృష్ణ మాట్లాడుతూ ‘ఆ ఫ్లాప్‌ల సమయంలో దర్శకుడు కె. విశ్వనాథ్‌ సూత్రధారులు సినిమా కోసం ఆడిషన్‌కు పిలిచారు. డాన్స్‌ చేయమని చెప్పారు. ఆయనకు నచ్చి ఒప్పుకున్నారు. ఆ ఒక్క సినిమాతో యాక్టింగ్‌లో స్కూలు, కాలేజీ, పీజీ అంతా నేర్చుకున్నాను. అదే నా కెరీర్‌కు మొదటి మెట్టు. ఆ చిత్రం చూసిన తర్వాత కె. రాఘవేంద్రరావు అల్లుడుగారు సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నా కెరీర్‌ వేగంగా సాగింది. మంచి చిత్రాలు చేశాను’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News