ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. ఇటీవల బ్యూటిఫుల్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరోయిన్ నైనాతో స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నైనా గంగూలీ కాళ్లు పట్టుకుని మరోసారి వార్తల్లోకెక్కారు ఆర్జీవీ.
రామ్‌గోపాల్ వర్మ సమకూర్చిన కథతో తెరకెక్కిన బ్యూటిఫుల్ను ట్రిబ్యూట్ టు రంగీలా అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలకు సిద్ధం చేశారు. అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నైనా గంగూలీ, సూరి ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీని హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ పార్టీకి అభిమానులు, సినీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అయితే ఇందులో భాగంగా బ్యూటిఫుల్ నటీనటులతో కలిసి ఆర్జీవీ డ్యాన్సులు వేశారు. దీంతో అక్కడ ఉన్న అభిమానులు ఈలలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఈ సినిమాలో ఓ పాటకు హీరోయిన్ నైనాతో కలిసి ఆర్జీవీ డ్యాన్స్ చేశారు. డ్యాన్స్‌లో భాగంగా ఆయన హీరోయిన్ నైనా కాళ్లపై పడ్డారు. ఆర్జీవీ చేసిన పనికి షాక్‌కు గురైన నైనా ఒక్కసారిగా కింద కూర్చొన్నారు. రామ్‌గోపాల్ వర్మను పట్టుకొని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.