టాలీవుడ్‌ను ఊపేస్తున్న కొత్త సెన్సేషన్.. మీరా రాజ్ అందానికి సౌత్ ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే!
సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమకు మరో ఆశాజనక హీరోయిన్‌గా మీరా రాజ్ వేగంగా ఎదుగుతోంది. చూడచక్కని రూపం, గ్లామర్‌తో పాటు నటనలోనూ తనదైన ముద్ర వేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది మీరా రాజ్.
సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమకు మరో ఆశాజనక హీరోయిన్‌గా మీరా రాజ్ వేగంగా ఎదుగుతోంది. చూడచక్కని రూపం, గ్లామర్‌తో పాటు నటనలోనూ తనదైన ముద్ర వేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది మీరా రాజ్. పాత్రలో పూర్తిగా లీనమయ్యే నటన, భాషపై చూపించే నిబద్ధత, కష్టపడే తత్వం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ఇటీవల మీరా రాజ్ నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా ‘సన్ ఆఫ్’ (Son Of) ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రంలో తన పాత్రకు మీరా స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఉత్తర భారతీయురాలైనప్పటికీ, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంది. “భాషే అభినయానికి ప్రాణం” అన్న మాటను ఆచరణలో చూపించిందని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
ఈ సినిమా తర్వాత మీరా రాజ్ కెరీర్ మరింత వేగం పుంజుకుంది. తాజాగా ఆమెకు దక్కిన అత్యంత ప్రతిష్ఠాత్మక అవకాశం పాన్ ఇండియా చిత్రం ‘కాంచన 4’. ఈ సినిమాలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి వంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం ఆమెకు బిగ్ బ్రేక్‌గా మారింది. కొత్త టాలెంట్‌కు అవకాశం ఇచ్చే దర్శకుడు రాఘవ లారెన్స్, మీరా రాజ్‌పై నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ ఇవ్వడం విశేషం.
ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ, “నా మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన రాఘవ లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పని చేస్తున్నాను” అని భావోద్వేగంగా చెప్పింది.
ఇంకో విశేషం ఏమిటంటే, ‘కాంచన 4’లో తన పాత్రను మరింత సహజంగా మలచుకునేందుకు మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, అక్కడి సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
అందం, అభినయం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం – ఈ నాలుగు లక్షణాల సమ్మేళనమే మీరా రాజ్ అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్తరాదినుంచి వచ్చి, దక్షిణాది ప్రేక్షకులకు “మన అమ్మాయే” అనిపించేలా నటించగలగడం అంత సులువు కాదు. అయితే మీరా రాజ్ తన ప్రతిభతో అది సాధ్యమని నిరూపిస్తోంది.
ప్రస్తుతం ఆమె కెరీర్ స్పీడ్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సౌత్ సినీ ఇండస్ట్రీకి మరో రైజింగ్ స్టార్ వచ్చేసిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.