Bachchan Family : విడాకుల వార్తలకు వెయ్యి వోల్టుల షాక్...ఒక్కటైన అభిషేక్-ఐశ్వర్య..బచ్చన్ ఫ్యామిలీలో పండగ

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల రూమర్లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.

Update: 2025-12-20 07:00 GMT

Bachchan Family : విడాకుల వార్తలకు వెయ్యి వోల్టుల షాక్...ఒక్కటైన అభిషేక్-ఐశ్వర్య..బచ్చన్ ఫ్యామిలీలో పండగ

Bachchan Family : గత కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల రూమర్లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ స్టార్ కపుల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారు విడివిడిగా ఉంటున్నారని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ.. తాజాగా ఈ జంట కలిసి సందడి చేశారు. తమ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ స్కూల్ వార్షికోత్సవం కోసం అభిషేక్, ఐశ్వర్య ఒకే వేదికపైకి వచ్చి కెమెరా కళ్లకు చిక్కారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని మరోసారి స్పష్టమైంది.

ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న ఆరాధ్య.. స్కూల్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది. కూతురి పెర్ఫార్మెన్స్ చూడటానికి ఐశ్వర్యరాయ్ తన తల్లి బృందారాయ్‌తో కలిసి రాగా, అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్ బచ్చన్‌తో కలిసి వచ్చారు. అందరూ కలిసి ఒకేచోట కూర్చొని ఆరాధ్యను ఉత్సాహపరుస్తూ కనిపించారు. చాలా కాలం తర్వాత బచ్చన్ కుటుంబం మొత్తం ఇలా కలిసి కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

గతంలో అనంత్ అంబానీ వివాహ వేడుకలో ఐశ్వర్య తన కూతురితో విడిగా రావడం, బచ్చన్ కుటుంబం మొత్తం విడిగా రావడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు షికారు చేశాయి. దీనికి తోడు అభిషేక్ పేరు మరో నటితో ముడిపడటం ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది. అయితే ఈ గాసిప్స్ గురించి అభిషేక్ గతంలోనే స్పందించారు. తన కూతురు ఆరాధ్యకు ఫోన్ లేదని, తన తల్లిదండ్రుల గురించి బయట ఎలాంటి వార్తలు వస్తున్నాయో ఆమెకు తెలియదని, ఆమెను ఈ చెడు వార్తల నుండి దూరంగా ఉంచుతున్నామని ఆయన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

పెళ్లయి 19 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఈ జంట గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ, తాజా దృశ్యాలు చూశాక వారిద్దరి మధ్య అనుబంధం ఇప్పటికీ బలంగానే ఉందని అర్థమవుతోంది. కేవలం కూతురి కోసం మాత్రమే కాదు, ఒక కుటుంబంగా వారు కలిసి ఉండటాన్ని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ఐష్-అభి కలిసి కనిపించడం విడాకుల వార్తలకు పెద్ద ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.

Tags:    

Similar News