Radhika Apte: డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించా… ఏ నటికి ఇలాంటి పరిస్థితులు ఎదురవకూడదు
ధైర్యంగా తన అభిప్రాయాలను పంచుకునే నటి రాధికా ఆప్టే, పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
Radhika Apte: డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించా… ఏ నటికి ఇలాంటి పరిస్థితులు ఎదురవకూడదు
ధైర్యంగా తన అభిప్రాయాలను పంచుకునే నటి రాధికా ఆప్టే, పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, లైంగిక వివక్ష గురించి వివరించారు. కొన్ని చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయని చెప్పింది.
రాధికా చెప్పారు, ‘‘బాలీవుడ్‌లో నాకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. వాటి కోసం కలిసాను. తర్వాత వారి నిజస్వరూపాన్ని తెలుసుకుని, ఇక వారిని జీవితంలో కలవకూడదని నిర్ణయించుకున్నాను. ఆ వ్యక్తులు పరిశ్రమలో పేరున్నవారు. కానీ నిజంగా ఎలా ఉన్నారో వారి తో సమావేశం అయిన తర్వాతే తెలుసుకున్నా. వారి పేర్లను చెప్పితే అందరూ ఆశ్చర్యపోతారు.’’
తన ఆర్థిక పరిస్థితుల కారణంగా, ‘‘డబ్బు అవసరం కారణంగా కొన్నిసార్లు దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చింది. అక్కడ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. సెట్స్‌లో నేను ఒక్క మహిళే ఉండేవట్లుగా పరిస్థితులు ఉండేవి. మారుమూల పట్టణాల్లో షూటింగ్ జరిగేది. సెట్‌లో మహిళల గురించి అసభ్యకరమైన జోకులు కూడా వినిపించేవి. ఆ రోజులు గుర్తుచేసుకుంటే, ఇప్పటికీ నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏ నటికి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు’’ అని తెలిపారు.