Biggboss 9 : నరాలు తెగే ఉత్కంఠకు తెర.. బిగ్ బాస్ విజేత ఎవరో ఫిక్స్.. రన్నరప్‌గా తనూజ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగి నేడు (డిసెంబర్ 21) గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది.
Biggboss 9 : నరాలు తెగే ఉత్కంఠకు తెర.. బిగ్ బాస్ విజేత ఎవరో ఫిక్స్.. రన్నరప్‌గా తనూజ!
Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగి నేడు (డిసెంబర్ 21) గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. 105 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో గొడవలు, ఎమోషన్లు, టాస్కుల మధ్య చివరికి టాప్-5 కంటెస్టెంట్లు మిగిలారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సీజన్ విజేత ఎవరో ముందే తెలిసిపోయిందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ సీజన్ విన్నర్ ట్రోఫీని కళ్యాణ్ పడాల అందుకున్నట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్ష ద్వారా కామనర్ కేటగిరీలో అడుగుపెట్టిన కళ్యాణ్, తనదైన గేమ్ ప్లాన్‌తో భారీగా ఓట్లు సంపాదించి రికార్డు సృష్టించబోతున్నాడట. ఇక రన్నరప్ స్థానంలో తనూజ పుట్టస్వామి నిలిచినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఓటింగ్‌లో గట్టి పోటీ జరిగినప్పటికీ, చివరికి కళ్యాణ్ కే విన్నర్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక మిగిలిన కంటెస్టెంట్ల విషయానికి వస్తే, సంజన గల్రాని 5వ స్థానంలో, డెమన్ పవన్ 4వ స్థానంలో, ఇమ్మాన్యుయేల్ 3వ స్థానంలో నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నేటి రాత్రి 7 గంటలకు స్టార్ మాలో ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున అట్టహాసంగా విన్నర్‌ను ప్రకటించనున్నారు. ఈ వేడుకకు స్పెషల్ గెస్టులుగా హీరో రవితేజ తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం రానుండగా, హీరో శ్రీకాంత్ తన కొడుకు రోషన్ సినిమా చాంపియన్ ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. వీరితో పాటు డింపుల్ హయాతి, పాయల్ రాజ్‌పుత్ డాన్స్ పెర్ఫార్మెన్సులు, సింగర్ మంగ్లీ పాటలు ఫినాలేను మరింత కలర్‌ఫుల్‌గా మార్చబోతున్నాయి. విన్నర్‌కి రూ. 50 లక్షల నగదుతో పాటు ఒక లగ్జరీ కారు కూడా లభించనుంది.