రామ్ చరణ్ పాత్రలో మూడు వేరియేషన్

Update: 2019-02-15 09:59 GMT

'బాహుబలి' సినిమా తర్వాత ప్రస్తుతం అందరి కళ్ళు 'ఆర్ ఆర్ ఆర్' పైన ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అనౌన్స్ చేసినప్పటినుండి సినిమా కథ గురించి మరియు పాత్రల గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు మూడు షేడ్లు ఉంటాయట. మొదట బ్రిటీష్ ఆఫీసర్ గా తరువాత మాస్ లీడర్ గా ఆ తర్వాత స్వాతంత్ర సమర యోధుడిగా రామ్ చరణ్ పాత్ర ఉంటుందట. ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలో రామ్ చరణ్ కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా బోలెడు పేర్లు వినిపిస్తున్నప్పటికీ చిత్రబృందం మాత్రం ఇంకా అధికారిక ప్రకటనను ఇవ్వలేదు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Similar News