Rakul Preet Singh: బాలయ్య సరసన ఫిట్ నెస్ బ్యూటీ
Rakul Preet Singh: గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించనున్న క్రేజీ మూవీలో రకుల్ కి ఛాన్స్ దక్కిందనే న్యూస్ వినపడుతోంది.
Rakul Preet Singh
Rakul Preet Singh: ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలయ్య బాబు పక్కన చేస్తుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించనున్న క్రేజీ మూవీలో రకుల్ కి ఛాన్స్ దక్కిందనే న్యూస్ వినపడుతోంది.
రకుల్ కి యూత్ లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బ్యూటీతో పాటు ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయడం రకుల్ స్పెషాలిటీ. ఏ హీరో పక్కనైనా ఈ టవర్ బ్యూటీ హైలెట్ అయిపోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో రకుల్ ఇమేజ్ బాగానే ఉందనుకోవాలి. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా తెలుగులో సినిమాల్లో రకుల్ హావా కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం.. హిందీలో ఆమెకు స్టార్ హీరోల సినిమా ఆఫర్లు రావడమే అన్నట్లుగా టాక్.
ప్రస్తుతం బాలయ్య… బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి.. తన తదుపరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలనుకుంటున్నాడట బాలయ్య.