ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్ వీడియో
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో ఆయనను శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అపోలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే.
రజనీకాంత్ ఫైల్ ఫోటో
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో ఆయనను శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అపోలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. కాగా రజనీకాంత్ హైదరాబాద్ అపోలో హాస్పటల్ నుంచి కొద్దిసేపటి క్రితంమే డిశ్చార్జి అయ్యారు.'అన్నాత్తై'షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న రజనీకాంత్ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో.. ఆయన్ను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. రజనీకి చికిత్స చేసిన వైద్యులు ఆయన కోలుకోవడంతో ఈ మధ్యాహ్నం తర్వాత డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి చెన్నై పయనం అయ్యారు.
అటు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రజనీకాంత్ కి అపోలో వైద్యులు సూచించారు. అపోలో ఆస్పత్రి వైద్యులు రజనీకి తగు సూచనలు చేశారు. ఆయన కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా కొద్దిపాటి వ్యాయామం చేయాలని చెప్పారు. రజనీకాంత్ వయసు రీత్యాఆరోగ్య నియమాలు పాటించాలని స్పష్టం చేశారు.