Allu Arvind: అల్లు అరవింద్ ఇంట్లో విషాదం
Allu Arvind: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Allu Arvind: అల్లు అరవింద్ ఇంట్లో విషాదం
Allu Arvind: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ (వయసు 94) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు.
కనకరత్నమ్మ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు.
సినీ ప్రముఖులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు సినిమాల షూటింగ్‌ల నిమిత్తం మైసూర్, ముంబయిలలో ఉన్నారు. వారు మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.