YS Jagan Biopic: త్వరలో వైఎస్ జగన్ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా..

YS Jagan Biopic: మూవీ ఇండస్ట్రీలో పొలిటికల్ బయోపిక్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.

Update: 2021-07-02 15:45 GMT

జగన్(ఫైల్ ఇమేజ్ )

YS Jagan Biopic: మూవీ ఇండస్ట్రీలో పొలిటికల్ బయోపిక్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ సైతం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్‌లో హీట్ పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ హిస్టరీ బయోపిక్ రూపంలో రానుందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మూవీని యాత్ర దర్శకుడు మహి.వి రాఘవ డైరెక్ట్ చేయబోతున్నాడన్న న్యూస్ వైసీపీ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి.

మరోవైపు ఈ సెన్షేషనల్ పొలిటికల్ బయోపిక్‌లో జగన్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. స్కామ్ 1992 వెబ్‌సిరీస్‌లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రతీక్ గాంధీ జగన్ రోల్‌లో పొలిటికల్ పంచ్ డైలాగ్‌లు పేల్చబోతున్నట్లు తెలుస్తోంది.! గతంలో యాత్ర విజయం తర్వాత పార్ట్-2 చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో యాత్ర పార్ట్‌-2 జగన్ కథాంశంతోనే అన్న వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి.

జగన్ అసలైన పొలిటికల్ కెరీర్‌ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ప్రారంభమైందని చెప్పాలి. అధిష్టానాన్ని ధిక్కరించి బయటకు రావడం సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకూ జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా ఈ బయోపిక్ తోరకెక్కిస్తారనే చర్చ జోరందుకుంది. ఈ పొలిటికల్ బయోపిక్‌పై ఎప్పటినుంచో బజ్ ఉన్నప్పటికీ తాజాగా ఈ బయోపిక్‌లో ప్రతీక్ గాంధీ నటించబోతున్నాడనే వార్తలతో జగన్ బయోపిక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుందనే వార్తలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. తమ అభిమాన నేతను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసేందుకు రెడి అయిపోతున్నారు.

Tags:    

Similar News