Prabhas: ప్రభాస్ షూటింగ్‌లో ప్రమాదం: ఆందోళనలో ఫ్యాన్స్.. అసలేమైందంటే?
Prabhas: టాలీవుడ్ 'రెబల్ స్టార్' ప్రభాస్ ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.
Prabhas: టాలీవుడ్ 'రెబల్ స్టార్' ప్రభాస్ ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. రీసెంట్‌గా రాజా సాబ్ సినిమాతో సంక్రాంతి సందడి చేసిన ఈ బాహుబలి, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా సెట్స్‌లో ప్రభాస్ గాయపడ్డారనే వార్త ఇప్పుడు నెట్టింట కలకలం రేపుతోంది.
సినిమాలోని కీలక సన్నివేశాల కోసం ప్రభాస్ హార్స్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యుద్ధ నేపథ్యంలో సాగే కథ కావడంతో, ప్రభాస్ రిస్క్ తీసుకుని మరీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నియంత్రణ తప్పి కింద పడటంతో ఆయన చేతులకు గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం, సెట్స్‌లోనే ప్రభాస్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలు తీవ్రమైనవి కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కండరాల నొప్పులు తగ్గడానికి మరియు గాయాలు మానడానికి వైద్యులు ఆయనకు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ప్రభాస్ తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. గాయమైనా సరే, షెడ్యూల్‌కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేవలం రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' కంటే ముందే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ పట్టుదలతో ఉన్నారు. ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆయన త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ సన్నిహితులు ధీరజ్ ఇస్తున్నారు.