Pawan Kalyan 27 Movie Update : రామ్ టైటిల్ తో పవన్ సినిమా?
Pawan Kalyan 27 Movie Update : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది పవన్
Ram, Pawan kalyan
Pawan Kalyan 27 Movie Update : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది పవన్ కళ్యాణ్ కి 27 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చారిత్రక నేపధ్యం చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ప్రీలుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ 15 రోజులు పాల్గొన్నట్టుగా దర్శకుడు క్రిష్ వెల్లడించాడు. ఇక లాక్‌డౌన్ వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ఈ సినిమా టైటిల్ విషయంలొ గత కొద్దిరోజులుగా ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాకి విరుపాక్ష అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు మరో టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. కొత్తగా వినిపిస్తున్న టైటిల్ 'శివమ్'.. అయితే గతంలో ఇదే టైటిల్ రామ్ తో హీరోగా ఓ సినిమా వచ్చింది కూడా.. మళ్ళీ ఇదే టైటిల్ ని పవన్ కళ్యాణ్ సినిమాకి పెట్టాలని అనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఇందులో పవన్ పాత్ర రాబిన్‌హుడ్ తరహాలో ఉంటుందని సమాచారం.. జాక్వెలిన్ ఫేర్నాండేజ్ కీలకపాత్రలో నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం..
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి హాలీవుడ్ నిపుణులు పనిచేయడం మరో విశేషం. ఇక ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలను సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.