Pawan Kalyan 27 Movie update : హాలీవుడ్ హంగులతో పవన్ సినిమా!

Pawan Kalyan 27 Movie update : హాలీవుడ్ హంగులతో పవన్ సినిమా!
x

Pawan Kalyan

Highlights

Pawan Kalyan 27 Movie update : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది పవన్ కళ్యాణ్

Pawan Kalyan 27 Movie update : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది పవన్ కళ్యాణ్ కి 27 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చారిత్రక నేపధ్యం చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. తాజాగా పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ప్రీలుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ 15 రోజులు పాల్గొన్నట్టుగా దర్శకుడు క్రిష్ వెల్లడించాడు. ఇక లాక్‌డౌన్‌ వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఈ సినిమాకి హాలీవుడ్ నిపుణులు పనిచేయనున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట మేకర్స్.. దీంతో హాలీవుడ్‌ నిపుణులు రంగంలోకి దింపుతున్నారట.. 'ఆక్వామెన్‌', 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌', 'వార్‌క్రాఫ్ట్‌' వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమాకి పనిచేస్తున్నారట.. తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా అయన పవన్ ని బర్త్ డే విషెస్ ని అందించారు.

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందులో ఓ బాలీవుడ్ హీరో విలన్ గా నటించనున్నారని సమాచారం.. అంతేకాకుండా ఇద్దరు హీరోయిన్ లు ఇందులో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. రామ్‌-లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలను సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories