మహిళా ఎంపీకి షాక్.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్!
Nusrat Jahan Seeks Police Help : ఆన్‌లైన్ ప్రమోషన్ కోసం తన అనుమతి లేకుండా వీడియో చాట్ యాప్‌పైన తన ఫోటోను ఉపయోగించరంటూ
Nusrat Jahan
Nusrat Jahan Seeks Police Help : ఆన్‌లైన్ ప్రమోషన్ కోసం తన అనుమతి లేకుండా వీడియో చాట్ యాప్‌పైన తన ఫోటోను ఉపయోగించరంటూ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ఆమె కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యాప్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. "అనుమతి లేకుండా ఇలా నా చిత్రాలను ఉపయోగించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. కోల్‌కతా పోలీసులు దయతో పరిశీలించమని అభ్యర్థిస్తాను. దీన్ని చట్టబద్ధంగా చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని కమిషనర్ అనుప్ శర్మకి ట్యాగ్ చేశారు. దీనిపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
నుస్రత్ జహాన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. మోడల్ నుంచి హీరోయిన్ గా ఎదిగింది నుస్రత్ జహాన్.. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. బసీర్‌హాట్ నియోజకవర్గం నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక అదే ఏడాది ఆమె వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.