ఐసీయూలో నుస్రత్ జహాన్.. ప్రమాదం లేదన్న వైద్యులు

Sumitra
Published on: 18 Nov 2019 9:27 PM IST
నుస్రత్ జహాన్
X
నుస్రత్ జహాన్

ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు నుస్రత్ జహాన్‌ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందుకు అపోలో గ్లెనెగల్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు సోమవారం తెలిపారు. మందులను అధిక మోతాదులో వాడారన్న పుకార్లని వారు కొట్టిపారేశారు.

ఆదివారం రాత్రి శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమెని 9.30 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరి కొద్ది సేపటిలో ఆమె డిశ్చార్జ్ డిశ్చార్జ్ కానుందని, తమ ఇంటికి చేరుకుంటారని వారు తెలిపారు.

ఆమెకు ఎప్పటినుంచో ఆస్తమా సమస్య ఉందని, ఆమె తరచూ ఇన్హేలర్ ను వాడుతారని తెలిపారు. కానీ ఈ సమస్య నిన్న ఎక్కువగా అయిందని తాను వాడిన ఇన్హేలర్ తనకు సరిపోలేదని IANS కి తెలిపారు. ఉదయం నుండి ప్రచారం అవుతున్న హాగానాలను, వారి కుటుంబ సభ్యులు కొట్టిపారేసారు. నుస్రత్ జహాన్‌ భర్త నిఖిల్ జైన్ తాను ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చేరినప్పటి నుంచి ఆమెతోనే ఉన్నానని ఆయన చెప్పారు.

ఈ వార్తను ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..


Sumitra

Sumitra

Next Story