సుధీర్-రష్మీ..బుల్లి తెర మీద లవ్లీ న్యూస్ కి కేరాఫ్ ఎడ్రస్. జబర్దస్త్ షో లో వీరిద్దరూ విడివిడిగా ఎంత పాప్యులరో.. కలివిడిగా కూడా అంతే పాపులర్. సుధీర్-రష్మీ మధ్య ఎదో ఉంది అనే వార్తలు లేని రోజు దాదాపు లేదు. వీరిద్దరూ కల్సి జబర్దస్త్ లో కనిపించినా.. ఢీ షోలో మెరిసినా.. వారి మధ్య నడిచే ట్రాక్ కి వుండే రేటింగ్ సపరేట్!
రష్మీ ఛీ అన్న.. సుధీర్ నవ్వుతాడు. రష్మీ నువ్వు లేకపోతె నేనెలా బతుకుతాను అని సుధీర్ అంటే.. ముద్దుగా విసుక్కుంటూనే సిగ్గులు ఒలకపోసేస్తుంది రష్మీ. వీరిద్దరి నిజమైన బంధం ఏమిటీ అనేది ఎవరికీ తెలీకపోయినా ఇద్దరి మధ్య ఎదో ఉందన్న భావనతోనే ప్రేక్షకులు ఉంటారు. దానినే ఆయా షోల దర్శకులు క్యాష్ చేసుకుంటున్నారు. షోలలో ఇద్దరి మధ్య నడిచే ప్రేమ బంధాన్ని చూపించేలా ఎన్నో ఎపిసోడ్ లు ఇప్పటివరకూ నడిచాయి. ఇక గేమ్ షోలో వారం వారం ఇదే కంటిన్యూ అవుతూ వస్తోంది.కచ్చితంగా వీరిద్దరి మధ్య ఎదో ఉందని ప్రేక్షకులు అనుకునేలా స్కిట్ తయారు చేస్తూ వస్తున్నారు. అది నటన అని అనుకోవడానికి కూడా వీలులేనంతగా సుధీర్, రష్మీ జీవించేస్తున్నారు.
ఇక వీరిద్దర్నీ బయట ఎవరన్నా ఏమిటి సంగతీ? అని ప్రశ్నిస్తే, అదంతా ఉత్తిదే అనే సమాధానమే వస్తుంది. ఇలా ఇద్దరూ తమ బుల్లితెర ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల రష్మీ తమ మధ్య సంబంధం గురించి ఒక ఛానల్ లో చాలా స్పష్టంగా మాట్లాడారు.
ఆ ఇంటర్యూలో సుధీర్ కీ మీకూ మధ్య ఎఫైర్ ఉందని అనుకుంటున్నారు? మీరు కూడా దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్పుడు దీనికి ఎండ్ కార్డు వేస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి రష్మీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
''సుధీర్‌తో నా రిలేషన్ ఏంటన్నది నాకు తెలియదు.. మేం చేసే షోకి ఎండ్ కార్డ్ పడితే.. బహుషా మా రిలేషన్‌కి ఎండ్ కార్డ్ పడొచ్చేమో. షో నడుస్తున్నప్పుడు మాకు ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది. మా గురించి చాలా మంది చాలా రకాలుగా రాస్తున్నారు.. అనుకుంటున్నారు.. రాసుకునే వాళ్లు రాసుకోండి.. అనుకునే వాళ్లు అనుకోండి. దీనిపై ఇప్పుడు కూడా నేను క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు''. అంటూ అందరికీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు రష్మీ. అంతే కాదు, ''ముఖ్యంగా నాకు క్లారిటీ ఇవ్వాలని లేదు.. ఎందుకంటే దానివల్ల నాకేం ప్రాబ్లమ్ లేదు. మీకే ప్రాబ్లమ్. షోలో సుధీర్‌తో నాకు లవ్ ట్రాక్ నడుస్తోంది.. నడవనీయండి. ఇందులో క్లారిటీ ఇవ్వడానికి ఏం ఉంది. పాపం యూట్యూబ్, మీడియా వాళ్లు కూడా బతకాలికదా.. వాళ్లకీ వ్యూస్ కావాలి కదా.. మేం ఎండ్ కార్డ్ పెట్టేస్తే ట్రెండింగ్‌లో ఎలా వస్తాం. ఇలాంటి రూమర్స్ మాపై రావాలంటే వీళ్లని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపై ఉంది'' అంటూ యుట్యూబ్, వెబ్సైట్ ల వారి మీద సెటైర్ వేశారు రష్మీ.