Nee Kallu Neeli Samudram Song : నీ క‌న్ను నీలి స‌ముద్రం... 100 మిలియన్ల వ్యూస్!

Nee Kallu Neeli Samudram Song : మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకి హీరోగాపరిచయం అవుతున్నాడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

Update: 2020-08-02 10:40 GMT
uppena poster

Nee Kallu Neeli Samudram Song : మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకి హీరోగాపరిచయం అవుతున్నాడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి కొత్తేమికాదు.. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీయస్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు ఉప్పెన సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతోకలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..

ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నిత్యా శెట్టి అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సాంగ్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేశాయి. ఇక సినిమాలోని 'నీ క‌న్ను నీలి స‌ముద్రం' అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. జావేద్ అలీ మధురమైన గాత్రం, శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను మరింత ఆక‌ర్షణీయంగా మార్చేసింది.

అయితే ఈ పాట ప్రస్తుత్తం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌కు అత్యంత చేరువలో ఉంది. నేడు మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా దేవిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 మిలియన్ల పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాని ధియేటర్ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

Tags:    

Similar News