Nagabandham: 24 గంటల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్..బాక్సాఫీస్ షేక్ అవుతుందిగా..!
Nagabandham: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మిస్టికల్ అడ్వెంచర్ జానర్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న "నాగబంధం" చిత్ర టీజర్,
Nagabandham: 24 గంటల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్..బాక్సాఫీస్ షేక్ అవుతుందిగా..!
Nagabandham: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మిస్టికల్ అడ్వెంచర్ జానర్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న "నాగబంధం" చిత్ర టీజర్, మహాశివరాత్రి పర్వదినాన విడుదలై ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో ఏ రేంజ్ అంచనాలు నెలకొల్పాయో నిరూపించింది.
ఈ టీజర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం విరాట్ కర్ణా మేకోవర్. తన పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపేస్తూ, శివుని అంశతో కూడిన అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆయన కనిపించిన తీరు అద్భుతం. కళ్ళలో కసి, శరీర భాషలో గాంభీర్యం చూస్తుంటే, ఒక భారీ స్థాయి యాక్షన్ ఎపిక్ సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. ఆయన ఎనర్జీ టీజర్‌కు ప్రాణం పోసింది.
సాధారణంగా గ్రాఫిక్స్ అంటే కృత్రిమంగా ఉంటాయనే భావన ఉంటుంది. కానీ 'నాగబంధం' టీజర్‌లో హై-ఎండ్ VFX విజువల్స్ వెండితెరపై ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాయి. అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, మంత్రముగ్ధులను చేసే సినిమాటోగ్రఫీ చూస్తుంటే నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని అర్థమవుతోంది. టెక్నికల్‌గా ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది.
భారతీయ పురాణాలకు, ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టే కథాంశం.ఈ టీజర్ ఇచ్చిన హైప్‌తో, రాబోయే వేసవికి 'నాగబంధం' వెరీ వెరీ స్పెషల్ మూవీగా నిలవనుంది.సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'నాగబంధం' టీజర్ విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మార్మోగిపోతోంది. పురాణాలలోని నిగూఢ రహస్యాలను, వెండితెరపై విజువల్ వండర్‌గా చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ సృష్టించిన ఇంపాక్ట్ చూస్తుంటే, థియేటర్లలో 'నాగబంధం' రికార్డుల వేట మొదలైనట్లే అనిపిస్తోంది.