Megha Akash Replaces Niharika Konidela : నిహారిక అవుట్ .. మేఘా ఆకాష్ ఇన్!
Megha Akash Replaces Niharika Konidela : ఇటివల మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.. గుంటూరులోని
Megha Akash, Niharika Konidela
Megha Akash Replaces Niharika Konidela : ఇటివల మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. త్వరలోనే వివాహం జరగనుంది.. అయితే తమిళ్ లో ఆమె నటించబోయే ఓ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సినిమా నుంచి నిహారిక తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.
తమిళంలో స్వాతిని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పైన నిహారిక చాలా ఆశలే పెట్టుకుంది. కానీ నిశ్చితార్థం అవ్వడంతో సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నిహారిక స్థానంలో మేఘా ఆకాష్ ని తీసుకున్నారు మేకర్స్.. ఈ సినిమాలో భాగం కావడం పట్ల తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని మేఘా ఆకాష్ తన ఆనందాన్ని వ్యక్తంచేసింది. 'విభిన్నమైన కథాంశాలతో నాయిక పాత్రలకు ప్రాధాన్యమున్న కథలు లభించడం సులభం కాదు. అలాంటి అరుదైన అవకాశమిది' అని వెల్లడిచింది. కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాని నిర్మాత సెల్వకుమార్ నిర్మిస్తున్నారు.
అటు నిహారిక ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించాడు. ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయిన నిహారికకి మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాత సైరాతో పాటుగా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది నిహారిక..