Top
logo

Nagababu : నిహారిక వ్యక్తిత్వానికి ఆమె కారణం : నాగబాబు

Nagababu : నిహారిక వ్యక్తిత్వానికి ఆమె కారణం : నాగబాబు
X

Nagababu, Niharika

Highlights

Nagababu : నటుడు నాగబాబు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.. తాజా పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు

Nagababu : నటుడు నాగబాబు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.. తాజా పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు నాగబాబు.. తాజాగా నిన్న టీచర్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని చేశారు నాగబాబు. ఇందులో డా. సర్వేపల్లి రాధాకృష్ణ గొప్పతనాన్ని వెల్లడించారు. తనకు విద్యాబుద్దులు నేర్పిన గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక తన కూతురు నిహారికకి గురువు శైలజ గురించి ఈ వీడియోలో చెప్పుకోచ్చారు నాగబాబు. ఈ రోజు నిహారిక వ్యక్తిత్వానికి ఆమె ఓ కారణమని అన్నారు నాగబాబు.. చిన్నపిల్లలకు చెప్పే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు వారి వ్యక్తిత్వ ఉన్నతిలో కీలకం అవుతాయని నాగబాబు వెల్లడించారు. ఈ రోజు నిహారిక గుడ్ గర్ల్ గా ఉండడానికి తలిదండ్రులుగా మా పెంపకం ఒకెత్తయితే వాళ్ల టీచర్ శైలజ ఇచ్చిన మంచి విద్యాబుద్ధులు మరో ఎత్తు అని అన్నారు. నిహారిక వ్యక్తిత్వం విషయంలో ఆమెదే కీలక పాత్ర అని నాగబాబు వెల్లడించారు.

ఇక త్వరలో నిహారికకి పెళ్లి కానున్న సంగతి తెలిసిందే.. గత నెల ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్ధం జరిగింది.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నిహారికకి కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ ఎవరో కాదు.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు తన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.

Web TitleActor Nagababu comments on niharika teacher shailaja
Next Story