Naga Babu wanted to commit suicide : జీవితంలో రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నా : నాగబాబు

Naga Babu wanted to commit suicide : తన జీవితంలో రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లుగా మెగా బ్రదర్ , నటుడు నాగబాబు ఇటీవల

Krishna
Updated on: 19 Aug 2020 5:08 PM IST
Naga Babu wanted to commit suicide : జీవితంలో రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నా : నాగబాబు
X
Nagababu (File Photo)

Naga Babu wanted to commit suicide : తన జీవితంలో రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లుగా మెగా బ్రదర్ , నటుడు నాగబాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.. అందులో ఒకటి తన కుటుంబంతో కలిసి సెలవు యాత్ర కోసం న్యూజిలాండ్ వెళ్ళామని అప్పుడు వరుణ్ తేజ్, నిహారిక చిన్నవాళ్ళు అని, ఆ సమయంలో తన కూతురు నిహారిక తప్పిపోయిందని నాగబాబు వెల్లడించారు.అయితే ఆ పర్యటనలో ఓక రోజు నిహారిక నేను అనుకుని నాలాగే డ్రస్ వేసుకున్న ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని అలా ఓ 20 నిమిషాల పాటు నిహారిక ఆచూకీ తెలియలేదని నాగబాబు చెప్పుకొచ్చారు..

నిహారిక కనిపించకపోవడంతో తనలో ఆందోళన మొదలైందని అన్నారు.. ఆ సమయంలో తన కుమారుడు వరుణ్‌ తేజ్‌ను ఇంటికి పంపించి.. నా భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టుగా నాగబాబు చెప్పుకొచ్చారు.. అని చెబుతూ తన కూతురు నిహారిక అంటే అంత ఇష్టం అని చెప్పాడు నాగబాబు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ నిహారిక లాంటి ఏంజెల్స్ పుడతారంటూ భావోద్వేగం అయ్యాడు. నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్నా వేస్ట్ అన్నతంగా కోపం వచ్చిందని అన్నారు.. ఎంతో పుణ్యం చేసుకుంటే వాడి కడుపున ఏంజెల్స్ పుడతారని అంటారు.. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక' అంటూ ఎమోషనల్ అయ్యారు నాగబాబు.

ఇక మరొకటి ఆరెంజ్ సినిమా ఘోరంగా ప్లాప్ అవ్వడం.. ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ సినిమా ప్లాప్ తో నాగబాబును తీవ్ర అప్పుల్లోకి చేరుకున్నారు.. దాని కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ అయన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆ సమయంలో సహాయం చేశారని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఇక త్వరలో నిహారికకి పెళ్లి కానున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్ధం జరిగింది.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నిహారికకి కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ ఎవరో కాదు.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు తన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story