Megastar Chiranjeevi: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Megastar Chiranjeevi: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Update: 2025-08-29 07:20 GMT

Megastar Chiranjeevi: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Megastar Chiranjeevi: అపారమైన వ్యక్తిత్వం, అద్భుతమైన సేవా ధర్మంతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి, మరోసారి తన మానవతా స్వభావాన్ని చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్‌ను కనులారా చూసే ఆకాంక్షతో సైకిల్‌పై హైదరాబాద్‌కు ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణం శారీరకంగా కష్టమైనదే కాక, మానసికంగా కూడా చాలాచోట్ల సవాళ్లను ఎదుర్కొనాల్సి వచ్చింది. అయినా చిరంజీవిపై ఆమెకున్న నిబద్ధత, అభిమానం ఆమెను ముందుకు నడిపించింది.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు, రాజేశ్వరిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆమె చూపిన అభిమానానికి చలించిపోయిన చిరు, ఆమెకు ఓ చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చారు. ఈ సందర్భంగా రాజేశ్వరి చిరంజీవికి రాఖీ కట్టి తన సోదరిగా భావనలు వ్యక్తం చేయగా, చిరంజీవి ఆమెకు ఆశీస్సులతో పాటు అందమైన పట్టు చీరను బహుమతిగా అందించారు.

అంతేగాక, రాజేశ్వరి పిల్లల విద్యాభవిష్యత్‌కు తనవంతు సహాయాన్ని అందించేందుకు చిరంజీవి హామీ ఇచ్చారు. ఆర్థికంగా పూర్తి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.

ఈ సంఘటన చిరంజీవి అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాక, తన కుటుంబ సభ్యుల్లా భావించే గొప్ప మనసును మరోసారి నిరూపించింది. వెండితెరపై హీరో మాత్రమే కాకుండా, నిజ జీవితంలోనూ మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అనిపిస్తారో ఇది స్పష్టంగా చూపించింది.

Tags:    

Similar News