అందుకోసం రాజమౌళిని రిక్వెస్ట్ చేశాం : చిరంజీవి

Chiranjeevi Acharya Movie : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రాన్ని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

Update: 2020-09-25 04:55 GMT

Rajamouli, Chiranjeevi, Ram charan

Chiranjeevi Acharya Movie : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రాన్ని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. మెగస్టార్ పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. " నేను నాన్న కలిసి తెరపై పూర్తి స్థాయిలో కనిపించాలని మా అమ్మ కల.. ఆచార్యలో మా కాంబినేషన్ అలరిస్తుందని నమ్ముతున్నా.. 2015లో నేను నటించిన బ్రూస్ లీ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. ఖైది నెంబర్ 150లో నేను నాన్నతో కలిసి డాన్స్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఆచార్యలో కలిసి నటిస్తున్నాం" అని చరణ్ వెల్లడించాడు.

అయితే తాజాగా దీనిపైన చిరంజీవి వెల్లడించాడు. దర్శకధీరుడు రాజమౌళిని రిక్వెస్ట్ చేసి మరీ ఆచార్య సినిమా కోసం చరణ్ డేట్స్ అడ్జెస్ట్ చేశామని అన్నారు.. " నేను చరణ్ కలిసి నటించడం నా భార్య సురేఖ కోరిక.. ఆచార్య లాంటి కథ మళ్ళీ దొరుకుతుందో లేదో అని.. ఆ పాత్రలో చరణ్ నటిస్తే బాగుంటుందని అనుకున్నాం. దీనితో చరణ్ తో RRR తీస్తున్న రాజమౌళిని రిక్వెస్ట్ చేసి మరి డేట్స్ అడ్జెస్ట్ చేశాం.. ఆచార్య షూటింగ్ వచ్చే ఏప్రిల్ కు పూర్తి అవుతుంది" అని చిరు వెల్లడించారు. 

Tags:    

Similar News