Mega157 Shooting: రంగంలోకి మెగాస్టార్.. మెగా 157 మూవీపై క్రేజీ అప్ డేట్..!

Mega157 Shooting: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన 157వ చిత్రం షూటింగ్ ఇవాళ (మే 23, 2025) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Update: 2025-05-23 12:10 GMT

Mega157 Shooting: రంగంలోకి మెగాస్టార్.. మెగా 157 మూవీపై క్రేజీ అప్ డేట్..!

Mega157 Shooting: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన 157వ చిత్రం షూటింగ్ ఇవాళ (మే 23, 2025) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ‘మెగా 157’ పేరుతో నిర్మితమవుతున్న ఈ సినిమా వచ్చే 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టును షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి అభిమానులకు ఇది ఓ పండుగే.

ఈరోజు మొదటి షెడ్యూల్ షూటింగ్‌లో చిరంజీవి కెమెరా ముందుకు వచ్చారు. ఇక ఈ చిత్రంలో ఆయన తన అసలుపేరు ‘శంకర్ వరప్రసాద్’ పాత్రలో పవర్‌ఫుల్ లుక్‌తో కనిపించనున్నారు.

ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. ఇప్పటికే నయనతార ఎంపికైనట్లు ప్రకటించగా, మరో కథానాయికగా కేథరిన్ తెరిసా కీలక పాత్రలో నటించనుందని ఫిలింనగర్ టాక్.

ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. అనిల్ రావిపూడి స్టైల్‌కు చిరంజీవి మాస్ పర్ఫార్మెన్స్ జోడైతే ఇంకేముంటుంది… సంక్రాంతికి మెగా ఫ్యాన్స్‌కి మామూలు సందడే అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News