అల్లు రామలింగయ్య జయంతి: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
Chiranjeevi Emotional Post : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హాస్యనటులు ఉన్నప్పటికీ అతికొద్ద మంది మాత్రమే తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
chiranjeevi, allu ramalingaiah
Chiranjeevi Emotional Post : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హాస్యనటులు ఉన్నప్పటికీ అతికొద్ద మంది మాత్రమే తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ అతి కొద్దిమందిలో దివంగత నటుడు అల్లు రామలింగయ్య ఒకరు.. దశాబ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్షకులను తన హాస్యంతో నవ్వులు పువ్వులు పూయించారు అల్లు రామలింగయ్య.. కేవలం హాస్యంతో పాటు విలనిజాన్ని కూడా పండించారయన.. రొటీన్ కామెడీతోనే తన మార్క్ ను చూపించి నవ్విస్తారయన.. అయన లాంటి మరో నటుడు ఇండస్ట్రీలో లేడనే చెప్పాలి.. 50ఏళ్ళ పాటు సినీ పరిశ్రమకి సేవలను అందించారు అయన.. నేడు అయన 99 వ జయంతి..
అయన జన్మదినం సందర్భంగా అయన అల్లుడు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు.. " ఆయన పేరు గుర్తురాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదుల్తుంది. మావయ్యగారు కేవలం అందరిని మెప్పించిన నటుడే కాదు.... తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్ కూడా.. స్వాతంత్ర సమరయోధుడు, తత్వవేత్త, నాకు మార్గదర్శి ..గురువు ...అన్నిటికి మించి మనసున్న మనిషి, ఈ 99 వ పుట్టిన రోజునాడు ఆయన్ని స్మరిస్తూ ... ... వచ్చే సంవత్సరం ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిన్తుందని ఆశిస్తున్నాను" అని చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటుగా చిరంజీవి తన పెళ్లినాటి అరుదైన పిక్ షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక చిరంజీవి, అల్లు రామలింగయ్య కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. 1929 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్య 2004 సంవత్సరంలో జులై 31వ తేదీన తుదిశ్వాస విడిచారు. అయన సినిమా పరిశ్రమకి అందించిన సేవలకి గాను 1990లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.