అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన బన్నీ!

Allu Studios : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా మెగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు బన్నీ..

Krishna
Updated on: 1 Oct 2020 2:53 PM IST
అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన బన్నీ!
X

Allu Studios : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా మెగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు బన్నీ.. అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని హైదరాబాదులో అల్లు స్టూడియోస్ పేరుతో భారీ స్టూడియో నిర్మిస్తున్నట్లుగా వెల్లడించాడు. ఇందులో సినిమాలకి, సీరియల్స్ కి సంబంధించిన చిత్రీకరణలకు ఉపయోగపడేలా భారీగా స్టూడియో ఉంటుందని తెలిపారు.

ఈ మేరకు అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీలతో పాటు అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. తన కొడుకుల భాగస్వామ్యంతోనే ఈ భారీ స్టూడియోని నిర్మించబోతున్నారు అల్లు అరవింద్.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. అంతకుముందు అల్లు రామలింగయ్యకి అల్లు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు.

నిర్మాతగా అల్లు అరవింద్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అయన చాలా సినిమాలని నిర్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాతల్లో అయన ఒకరు.. ఇక కరోనా వలన ధియేటర్లు మూతపడడంతో అయన 'ఆహా' ఓ ఓటీటీ వేదికను ప్రారంభించారు.. ఇక ఎప్పటినుంచో అనుకుంటున్న స్టూడియోస్ ని త్వరలోనే మొదలు పెట్టనున్నారు అరవింద్..

ఇక తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు అల్లు రామలింగయ్య.. ద‌శాబ్ధాల కాలం పాటు అయన తెలుగు ప్రేక్షకుల‌ను త‌న హాస్యంతో న‌వ్వులు పువ్వులు పూయించారు .. హాస్యంతో పాటుగా విల‌నిజాన్ని కూడా పండించారయన.. 50ఏళ్ళ పాటు సినీ ప‌రిశ్రమ‌కి త‌న సేవ‌ల‌నందించిన అయన 2004 జూలై 31న ఆయ‌న అనారోగ్యంతో క‌న్నుమూశారు. భౌతికంగా అయన ప్రేక్షకుల మధ్య లేనప్పటికీ, సినిమాల ద్వారా అయన ఎప్పటికి బ్రతికే ఉంటారు..

Krishna

Krishna

Next Story