Charan With Sukumar : మరోసారి రంగస్థలం కాంబో?

Charan with sukumar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మగధీర అనే చెప్పాలి.. అందులో

Update: 2020-08-06 10:39 GMT
Ram charan, sukumar (File Photo)

Charan with sukumar :: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మగధీర అనే చెప్పాలి.. అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు.. అయితే నటన పరంగా చూస్తే మాత్రం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం చెర్రిని స్థాయిని పెంచిది. ఆ చిత్రం చరణ్ ని విభిన్న కోణంలో ఆవిష్కరించింది.చిట్టిబాబు పాత్రలో చరణ్ నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి... అంతేకాకుండా ఈ సినిమాకి ప్రేక్షకులు కూడా క్యూలు కట్టారు. దీనితో బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

అయితే మెగా అభిమానులకి ఇప్పుడు మరో శుభవార్త అని చెప్పాలి.. ఇప్పుడీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని టాలీవుడ్ సర్కిల్ లో న్యూస్ వైరల్ అవుతుంది.. చరణ్ దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ సమయంలో ఓ స్క్రిప్ట్ రాశాడట సుక్కు.. ఈ లైన్ కూడా చరణ్ కి కూడా బాగా నచ్చడంతో చరణ్ కూడా ఒకే చెప్పాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపైన త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది.

ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అటు చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాల తరవాత చరణ్, సుకుమార్ కాంబో మళ్ళీ రీపిట్ కానుందని సమాచారం. 

Tags:    

Similar News