Sai Dharam Tej : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెగా మేనల్లుడు..

Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. కొద్ది సేపటి క్రితం సాయి చేసిన ఓ పోస్ట్ దీనికి సంకేతంగా

Update: 2020-08-23 06:21 GMT

sai dharam tej

Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. కొద్ది సేపటి క్రితం సాయి చేసిన ఓ పోస్ట్ దీనికి సంకేతంగా తెలుస్తోంది.. కొద్ది సేప‌టి క్రితం సాయి తేజ్ ఓ వీడియోని పోస్ట్ చేస్తూ... ఆ వీడియోలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్రభాస్‌కి సారీ చెబుతూ ..ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు త‌ప్పదు అంటూ చెప్పుకొచ్చాడు..

టాలీవుడ్ లోని బ్యాచిల‌ర్ హీరోలంద‌రు క‌లిసి సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూప్ లో ఉండగా, అందులో నుండి హీరో నిఖిల్‌, నితిన్‌, రానా ఇలా ఒక్కొక్కరు లెఫ్ట్ కాగా, తాజాగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా లెఫ్ట్ అయిపోయాడు. దీంతో అభిమానులు సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడని అనుకుంటున్నారు.. అయితే దీనిపైన క్లారిటీ రావాలంటే రేపు ఉదయం 10 గంటల వరకూ ఆగక తప్పదు..

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా "సోలో బతుకే సో బెటర్" అనే సినిమాని చేస్తున్నాడు.. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచాయి.



Tags:    

Similar News