Mahesh Babu : వార్ 2 ప్లాప్ టాక్ తో నిజమైన మహేష్ బాబు మాటలు.. వైరల్ అవుతున్న వీడియో
Mahesh Babu : వార్ 2 ప్లాప్ టాక్ తో నిజమైన మహేష్ బాబు మాటలు.. వైరల్ అవుతున్న వీడియో
Mahesh Babu : వార్ 2 ప్లాప్ టాక్ తో నిజమైన మహేష్ బాబు మాటలు.. వైరల్ అవుతున్న వీడియో
Mahesh Babu : వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, ఆ సినిమాతో సూపర్ హిట్ కొడతాడని అందరూ ఆశించారు. కానీ, ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ బాబు పాత వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. గతంలో అనేక తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధించాయి. బాహుబలి, బాహుబలి 2, పుష్ప వంటి సినిమాలు హిందీలో కూడా భారీ కలెక్షన్లు సాధించాయి. కానీ, తెలుగు స్టార్స్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం చాలా సందర్భాల్లో నిరాశనే ఎదుర్కొన్నారు.
రామ్ చరణ్ నటించిన జంజీర్, ప్రభాస్ నటించిన ఆదిపురుష్, విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలు హిందీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వారికి హిందీలో మంచి ఆఫర్లు రాలేదు. ఇక్కడ భారీ స్టార్ డమ్ ఉన్నప్పటికీ, బాలీవుడ్‌లో వారికి సరైన వెల్కమ్ లభించలేదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి.
ఒక సందర్భంలో మహేష్ బాబు, "నేను మీకు అహంకారిగా కనిపించవచ్చు. నాకు చాలా హిందీ ఆఫర్లు వచ్చాయి. కానీ, వారు నన్ను భరించలేరని నాకు అనిపిస్తుంది. నా సమయాన్ని వృథా చేసుకోవడం నాకు ఇష్టం లేదు" అని అన్నారు. ప్రస్తుతం చాలామంది ఈ మాటలను అంగీకరిస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2 కోసం రెండేళ్లు కేటాయించారు. కానీ, ఈ చిత్రం నిరాశపరచడంతో ఆయన కష్టం వృథా అయిందని అంటున్నారు. బాలీవుడ్ దర్శకులు సౌత్ స్టార్స్ కోసం మంచి కథలు, మంచి పాత్రలను సృష్టించడంలో విఫలమవుతున్నారని స్పష్టమవుతోంది. అందుకే, మహేష్ బాబు చెప్పిన మాటల్లో అర్థం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.