Mahesh babu creates new record: మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్న మహేష్..

Mahesh babu creates new record: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. మహేష్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద చాలా రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి.

Update: 2020-07-02 13:57 GMT

Mahesh babu creates new record: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. మహేష్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద చాలా రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. ఇక సినిమాలతో పాటుగా తాజా పరిణామాలపై, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టిివ్ గా ఉంటారు మహేష్ బాబు.. లాక్ డౌన్ సమయంలో క‌రోనాపై అవ‌గాహ‌న పెంచేలా ప‌లు విష‌యాలును అభిమానులతో పంచుకున్నారు మహేష్.. అలా తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ని ప‌ది మిలియ‌న్స్‌కి పెంచుకున్నాడు మహేష్. ప్రస్తుతం ట్విట్టర్ లో మహేష్ బాబును ఫాలో అయ్యే వారి సంఖ్య అక్షరాల కోటి అన్నమాట.. సౌత్ ఇండియాలో ఏ స్టార్‌కి ట్విట్ట‌ర్‌లో కోటి ఫాలోవ‌ర్స్ లేకపోవడం మరో విశేషం..

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది..ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

 

Tags:    

Similar News