Mahavatar Narsimha: ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’..!

Mahavatar Narsimha: ఆస్కార్ అవార్డుల పోటీలో భారత్ నుంచి తొలిసారిగా ఓ యానిమేటెడ్ చిత్రం అడుగుపెట్టింది.

Update: 2025-11-26 09:28 GMT

Mahavatar Narsimha: ఆస్కార్ అవార్డుల పోటీలో భారత్ నుంచి తొలిసారిగా ఓ యానిమేటెడ్ చిత్రం అడుగుపెట్టింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ‘మహావతార్ నరసింహ’ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 35 చిత్రాల జాబితాలో చేరింది. 

భారతీయ యానిమేషన్ చిత్రాల చరిత్రలో సరికొత్త అధ్యాయం రాసిన ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. 2026 ఆస్కార్ అవార్డుల ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 35 దేశాల చిత్రాలతో పాటు ఈ సినిమా కూడా ఎంపికైంది. భారత్ నుంచి ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చిన తొలి యానిమేటెడ్ చిత్రం ఇదే కావడం విశేషం.

‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్లు అందించిన హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జులై 25న విడుదలైంది. ఆరంభంలో అంచనాలు లేకపోయినా పాజిటివ్ మౌత్ టాక్‌తో రెండో వారం నుంచి దూసుకెళ్లింది. పాన్ ఇండియా స్థాయిలో రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి యానిమేషన్ జోనర్‌లో కొత్త రికార్డు సృష్టించింది. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం, ప్రహ్లాద చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దృశ్య వైభవం, సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 

Tags:    

Similar News