Madras HC - Dhanush: పేద ప్రజలు పన్నుకడితే నీకు కారుకు మినహాయింపు కావాలా?

Update: 2021-08-06 05:47 GMT

ధనుష్ కి మద్రాస్ హైకోర్టు షాక్ (ఫైల్ ఫోటో)

Madras High Court - Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ కి మద్రాస్ హైకోర్టు గురువారం మొట్టికాయ వేసింది. 2015లో ఒక లగ్జరీ కారును విదేశాల నుండి కొనుగోలు చేసినందుకు తనకు పన్ను మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించాడు ధనుష్. అయితే రోల్స్ రాయ్స్ కారు దిగుమతి తరువాత అక్కడి అధికారులు పన్ను చెల్లించాలని కోరడంతో కోర్టును పన్ను మిహయింపు విషయంలో ఆశ్రయించగా మద్రాస్ కోర్టు ధనుష్ కి గట్టిగానే క్లాసు పీకింది. సామాన్య ప్రజలు తాము వాడే సబ్బు మీద, అగ్గిపెట్ట మీద పన్నులు కడుతుంటే మీకు లగ్జరీ కార్లకు పన్ను మినహాయింపు కావాల్సి వచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు కదా పన్ను చెల్లింపు విషయంలో ఇబ్బంది ఏముందనే ప్రశించినట్లు సమాచారం. దీంతో ధనుష్ ఇప్పటికే తాను సగానికి పైగా పన్ను చెల్లించానని, మిగిలిన పన్ను కూడా ఆగష్టు 9న చెల్లిస్తానని కోర్టుకు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఇటీవలే తమిళ తలపతి విజయ్ కూడా పన్ను మినహాయింపు విషయంలో కోర్టును ఆశ్రయించగా తనకు కూడా అక్షింతలు వేసిన ఘటన తమిళ సినీ జనం మరువక ముందే ఇలా ధనుష్ కి జరగడంతో పన్ను విషయంలో ఇకపై కోర్టుకు వెళ్ళవద్దని పలువురు ప్రముఖులకు అర్ధం అయింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా తన 44వ చిత్రం "తిరుచిత్రంబలం" లో నటిస్తున్నాడు.   

Tags:    

Similar News