New OTT Releases This Week: ఈ వీకెండ్‌కి వినోదాల విందు.. ఓటీటీ, థియేటర్లలలో సందడి చేయనున్న మూవీస్‌..!

New OTT Releases This Week: ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నాయి.

Update: 2025-01-27 09:13 GMT

ఈ వీకెండ్‌కి వినోదాల విందు.. ఓటీటీ, థియేటర్లలలో సందడి చేయనున్న మూవీస్‌..!

New OTT Releases This Week:సంక్రాంతికి రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నాయి. ఇక జనవరి చివరిలో మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీల్లోకి రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూద్దాం.

కోలీవుడ్ హీరో విశాల్, సుందర్. సి దర్శకత్వం వహించిన సినిమా మదగజరాజు. ఈ సినిమా 2012లోనే పూర్తైనప్పటికీ పలు కారణాల వల్ల విడుదల 13 ఏళ్లు ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై విజయం సాధించింది. దీంతో ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో విడుదల కానుంది. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్ర బృందం భావిస్తోంది.

వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా రాచరికం. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. విజయ్ శంకర్, అప్సరా రాణి ఆయా పాత్రలు పోషించారు. రాయలసీమ పగ, ప్రతీకారాలతో పాటు అంతర్లీనంగా రాచరికం మూవీలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ఉంటుందని చెబుతున్నారు. గతంలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసిన అప్సర రాణి ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా జనవరి 31న థియేటర్లలోకి రానుంది.

కేవీ. ప్రవీణ్, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మహిష. స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై కేవీ. ప్రవీణ్ హీరోగా, దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం మహిళల పై జరుగుతున్న ఘటనలతో పాటు చాలా ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.

మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న మిస్టరీ థ్రిల్లర్ ఐడెంటిటీ. టొవినో థామస్, త్రిష లీడ్ రోల్స్‌లో అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమిది. జనవరి 24న తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జీ5లో జనవరి 31న తేదీ నుంచి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

పృథ్వీ, విస్మయ శ్రీ, శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా పోతుగడ్డ. ఈ సినిమాకు రక్ష వీరమ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఇక అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులను అలరించడానికి ట్రెబ్యునల్ జస్టిస్2 (వెబ్ సిరిస్) జనవరి 27 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బ్రీచ్ (హాలీవుడ్) జనవరి 30న, ఫ్రైడే నైట్ లైట్స్ (హాలీవుడ్) జనవరి 30న వస్తుంది. నెట్ ఫ్లిక్స్‌లో లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్) జనవరి 31, ది స్నో గర్ల్2 (వెబ్ సిరీస్) జనవరి 31 రానున్నాయి. జియో సినిమా: ది స్టోరీ టెల్లర్ (హిందీ) జనవరి 28 రానుంది. ఆపిల్ టీవీ ప్లస్: మిథిక్ క్వెస్ట్ (వెబ్ సిరీస్) జనవరి 29 విడుదల కానుంది. సోనీలివ్: సాలే ఆషిక్ (హిందీ) ఫిబ్రవరి 1 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News