Mind Block Video Song: మహేష్ 'మైండ్ బ్లాక్' .. గంటలోనే భారీ రికార్డు

Mind Block Video Song: మహేష్ మైండ్ బ్లాక్ .. గంటలోనే భారీ రికార్డు
x
Mahesh babu (File Photo)
Highlights

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒకటి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒకటి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.. మహేష్ బాబు మొదటిసారి ఆర్మీ లుక్ లో కనిపించడం, 13 ఏళ్ల తరవాత లేడి అమితాబ్ రీఎంట్రీ ఇవ్వడంతో సినిమాపైన అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో సినిమాకి మొదటిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక సినిమాకి ముందు దేవీ అందించిన పాటలకి ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇందులోని మైండ్ బ్లాక్ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ పాటకి మహేష్ బాబు వేసిన డాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అసలు మహేష్ కి డాన్స్ రాదు అన్న వారికీ ఈ పాట గట్టి సమాధానమే ఇచ్చింది. మహేష్ లుంగీ కట్టి మాస్ స్టెప్స్ వేస్తుంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. అయితే సినిమా యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా సినిమాలోని ఈ పాటకి సంబంధించిన వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది. యుట్యుబ్ లో రిలీజైన గంటలోపే ఈ పాటకి నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి.

అయితే దీనిపైన దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు . ' నేను ఎప్పటికి మర్చిపోలేని సంక్రాంతి ఇది... మహేష్ బాబుతో నా ప్రయాణం 50 రోజులు పూర్తి చేసుకుంది. నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నీకు అర్థమవుతోందా, రమణా.. లోడ్ ఎత్తాలిరా అన్న డైలాగులు వైబ్రేషన్ క్రియేట్ చేసాయి. ప్రేక్షకులూ సరిలేరు మీకెవ్వరూ అని పేర్కొన్నారు. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకర లతో కలిసి నిర్మించారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సంగీత, ప్రకాష్ రాజ్, మురళి శర్మ ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ సినిమాని మహేష్ పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి. కథలో చిన్న చిన్న మార్పులు చేయాలనీ మహేష్ వంశీని కోరారని టాక్ నడుస్తోంది. అయితే తన 27 వ సినిమాని మహేష్ పరుశురాంతో చేస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories