Lavanya Tripathi: కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి.. ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్‌..

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది.

Update: 2023-09-11 07:39 GMT

Lavanya Tripathi: కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి.. ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్‌..

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. మెగా కుటుంబానికి కోడలు అవడం అనేది చాలా పెద్ద బాధ్యత. వాళ్ళు ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. కొంచం అంటూ ఇటుగా ఉన్నా వాళ్ళు తీసుకోలేరు. వరుణ్‌ తేజ్‌తో నిశ్చితార్థం అయ్యాక అంతకు ముందే ఆమె ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా రద్దు చేసు​కున్నారు లావణ్య. ప్రస్తుతం ఆమెకు వస్తున్న అవకాశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారట. తమిళ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు కొన్ని నెలల క్రితమే లావణ్య ఓకే చెప్పారు.

'స్కైలాబ్‌' సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. కథ రీత్యా ఇందులో కథానాయిక పాత్ర కాస్తంత బోల్డ్‌గా ఉంటుందని తెలిసింది. పైగా ఇంటిమేట్‌ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుందట. అందుకే ఆ వెబ్‌సిరీస్‌ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్‌ని చూసుకోమని చెప్పేశారట లావణ్య. నిశ్చితార్థం అయిన తర్వాత ఇక నేను కొణిదలవారి కోడల్ని. ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట. ఈ విషయం తెలిసిన వారంతా లావణ్య నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News