Nagarjuna: తాతగా మారబోతున్న కింగ్ నాగార్జున?

టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో తాతగా మారబోతున్నారని వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Update: 2025-12-17 07:24 GMT

Nagarjuna: తాతగా మారబోతున్న కింగ్ నాగార్జున?

టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో తాతగా మారబోతున్నారని వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మొదట నాగచైతన్య-శోభిత దంపతుల గురించి రూమర్లు బయలుదేరినప్పటి నుంచి, తాజాగా అఖిల్-జైనబ్ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.

ఇక దీనిపై స్పందిస్తూ, ఇటీవల ఒక హెల్త్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీరు తాతగా ప్రమోట్ అవుతున్నారట కదా.. నిజమేనా?” అని మీడియా అడిగినప్పుడు, ఆయన నవ్వుతూ, “సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను” అని స్పందించారు.

ఆయన ఈ వార్తలను ఖండించకపోవడంతో, అక్కినేని ఇంట్లో త్వరలో చిన్న వారసుడు లేదా వారసురాలు అడుగుపెట్టబోతున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో గుప్పుగుప్పుగా చర్చిస్తున్నారు.

అంతేకాక, అదే వేదికపై నాగార్జున తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. గత 15 సంవత్సరాలుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేక, లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ మరియు PRP చికిత్సలు తీసుకుంటున్నారని వివరించారు.

అలాగే, “నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఉదయం మోకాలి కోసం వ్యాయామం తప్పకుండా చేస్తాను, అది ఒక రోజు కూడా మిస్ అవ్వదు” అని ఆయన తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించారు.

60 ప్లస్ లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే కనిపించే నాగార్జున, ఈలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన క్రమశిక్షణ ద్వారా వాటిని జయిస్తున్నారనేది అభిమానులను ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News